Sunday, December 22, 2024

పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల వడ్డన

- Advertisement -
- Advertisement -

80 paise hike on petrol and diesel

10 రోజుల్లో రూ. 6.40 పెంపు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం మరోసారి లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో గత 10 రోజుల్లో వీటి ధరలు లీటరుకు రూ. 6.40 చొప్పున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితమే సెంచరీ కొట్టిన పెట్రోల్ తాజా పెరుగుదలతో రూ. 101.81కి చేరుకుంది. లీటరు డీజిల్ ధర ఢిల్లీలో రూ. 93.07గా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ వివిధ రాష్ట్రాలలో స్థానిక పన్నులు వేర్వేరుగా ఉన్నందున వీటి ధరలు కూడా ఆయా రాష్ట్రాలలో వ్యత్యాసంగా ఉన్నాయి. నాలుగున్నర నెలల విరామం అనంతరం మార్చి 22న మొదలైన ధరల పెంపు ఇప్పటికి తొమ్మిదిసార్లు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News