Sunday, December 22, 2024

గొర్రెల మందపైకి దుసుకెళ్లిన గ్రానైట్ లారీ

- Advertisement -
- Advertisement -

చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రెండు వందలున్న గొర్రెల మందపైకి ఓ గ్రానైట్ లారీ దూసుకు వెళ్లటంతో దాదాపు 80 వరకు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి వెళితే ..మండల కేంద్రానికి చెందిన చౌదరి కనకయ్య, చౌదరి మనోజ్‌కుమార్, ముదురు సమ్మయ్యలకు చెందిన రెండు వందల గొర్రెల మందను ఎప్పటిలాగే ఇంటికి తీసుకొని వస్తుండగా పెట్రోల్ బంకు సమీపంలో కరీంనగర్ వైపు వేగంగా వచ్చిన గానైట్ లారీ మందపైకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో 80 గొర్రెలు మృతి చెందటంతో పాటు మరికొన్ని తీవ్రంగా గాయపడినట్టు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బండి రాజేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News