Friday, November 22, 2024

త్వరలో 80వేల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

80 thousand jobs soon in Telangana

జోనల్ విధానం అమలు మొదలైతే దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం

ఉద్యోగ నియామక ప్రక్రియ 3 నెలల్లో ప్రారంభం

ఇక మన కొలువులు మనకే

మనతెలంగాణ/హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో అదనంగా మరో 80వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర శాసనసభలో దళితబంధుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి దళితబంధుపై వివరణ ఇస్తూ రాష్ట్రంలో 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని వివరించారు.

నూతన జోనల్ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఏ జిల్లా వారికి ఆ జిల్లా కేడర్ పోస్టులు ఇచ్చేస్తామని తెలిపారు. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది లెక్క ఉంటుందన్నారు. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుందన్నారు. జోనల్ విధానం అనేది ఈ మధ్యే వచ్చిందని , అది ఒక్కసారి ల్యాంచ్ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుందన్నారు. ఆ ప్రక్రియ ప్రకారం కూడా 2, 3 నెలల్లో రిక్రూట్మెంట్ చేసేస్తామని వెల్లడించారు. కొంత మంది రేపే చేయాలి.

ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారని , ఈ ప్రక్రియ అలా చేసేది కాదన్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోందని,జోనల్ విధానానికి ఆమోదం తెలపమని ప్రతిపాదన పంపితే విపరీతమైన జాప్యం చేశారన్నారు. అందుకే ఉద్యోగాల భర్తీ ప్రక్రయిలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. నిన్న గాక మొన్ననే మన జోనల్ విధానం వచ్చిందని గుర్తెరగాలన్నారు. మనం తీసుకొచ్చుకున్న జోనల్ విధానాన్ని మనమే ధిక్కరించలేమన్నారు. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో తానే స్వయంగా మాట్లాడతానని , ఇప్పటికే సిఎస్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఒక్కసారి సెట్ అయిపోతే ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉద్యోగులను కొన్ని జిల్లాలకు కేటాయిస్తే మారుమూల ప్రాంతాలని భావించి అక్కడికి వెళ్లేందుకు సుముఖత చూపేవారు కాదన్నారు.

ఈ సందర్బంగా ములుగు తదితర జిల్లానలు సిఎం ఉదహరించారు. ఇకపై అలా ఉండబోదన్నారు. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. తనకున్న అంచనా ప్రకారం ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇచ్చి ఆందులో 1.30లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించామని తెలిపారు. జోనల్ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయన్నారు. అవి కూడా సౌకర్యవంతంగా, ఎక్కడి వాళ్లకు అక్కడే లభిస్తాయని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News