Thursday, April 3, 2025

బోరు బావిలో జారిపడి వృద్ధురాలి మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశా లోని సోనేపూర్ జిల్లాలో కయిన్‌ఫులా గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో బోరు బావిలో జారి పడి 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. ఈ బావి ఉపయోగంలో లేదు. సోమవారం సాయంత్రం ఈ వృద్ధురాలు బోరు బావిలో పడగా, స్థానికులు రాత్రంతా వెతికి పోలీస్‌లకు తెలియజేశారు. ఆమె చెవిటి, మూగదిగా కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆమెను బోరు బావిలో పడి ఉండడం చూసి వెంటనే అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. విషమ పరిస్థితుల్లో ఆమెను బయటకు తీయగలిగారు. సోనేపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News