Sunday, December 22, 2024

షిప్‌లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: ఓ క్రూయిజ్‌ షిప్‌లో కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్‌లో ఏకంగా 800 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నౌకను సిడ్నీ తీరంలో ఆపేశారు. కార్నివాల్‌ ఆస్ట్రేలియా కంపెనీకి చెందిన మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌక 12 రోజుల విహారయాత్రలో భాగంగా నాలుగు వేల ఆరు వందల మంది ప్రయాణికులతో న్యూజిలాండ్‌ నుంచి బయల్దేరింది.

సముద్రంలో సగం దూరం వెళ్లాకా, షిప్‌లో భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు క్రూజ్‌ ఆపరేటర్‌ కార్నివాల్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. వైరస్‌ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని, మరికొందరిలో స్వల్ప లక్షణాలున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారందరినీ షిప్‌లోనే క్వారంటైన్‌లో ఉంచినట్లు సంస్థ తెలిపింది. అందులోనే వాళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అటు చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు భారీగా బయటపడుతున్నాయి. కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News