Friday, January 17, 2025

ఏడు రోజుల్లో 800 కి.మీ.

- Advertisement -
- Advertisement -

ఎనిమిది జిల్లాల్లో క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీ
ఓటరు నమోదు, కొత్త యాప్‌లపై అవగాహన

క్రాస్ స్టేట్ ఓటర్ అవేర్ నెస్  సైకిల్ ర్యాలీలో సైక్లిస్టులను సత్కరించిన సిఈఓ వికాస్‌రాజ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీతో అవగాహన కల్పించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. రాష్ట్రంలో ఓటరుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఐదుగురు సైక్లిస్టులు చేపట్టిన 800 కిలోమీటర్ల క్రాస్ స్టేట్ సైక్లింగ్ ర్యాలీని మంగళవారం పూర్తి చేశారు. ఈ నెల 4వ తేదీన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఈ ర్యాలీని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రారంభించిన విషయం విధితమే.

ఈ సందర్భంగా వికాస్‌రాజ్ సైక్లిస్టులను అభినందించారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలోని జనగాం, హుస్నాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల మీదుగా సైక్లిస్టులు రాజేష్,మోహన్ యాదవ్, రాకేష్, నిఖిల్, విజయ్ ప్రసాద్‌ల ర్యాలీలో పాల్గొని.. ఓటర్లను ఓటు వేయమని ప్రోత్సహించారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్, జాయింట్ సిఈవో సర్ఫరాజ్ అహ్మద్, రిటైర్డ్ మేజర్ డాక్టర్ ఎవికె మోహన్ పాల్గొన్నారు.

Voter..

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News