Thursday, January 23, 2025

ముత్తయ్య ’800’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ’800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ’స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా ’800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ “పిచ్ ఎలా ఉన్నా సరే మురళీధరన్ బంతిని టర్న్ చేయగలడు. అతడిని ఎలా ఎదుర్కోవాలని మేం మీటింగ్‌లలో చర్చించేవాళ్లం” అని అన్నారు.

ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. “నేను బౌలింగ్ చేసినప్పుడు రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేదు. రాహుల్ ద్రావిడ్ కూడా!.. సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు ఎంఎస్ శ్రీపతి, వెంకట్ ప్రభు, మధుర్ మిట్టల్, పా రంజిత్, క్రికెటర్ సనత్ జయసూర్య, నిర్మాత వివేక్ రంగాచారి, మహిమా నంబియార్, యు.ఎఫ్.ఓ మూవీస్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News