- Advertisement -
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 544 రోజుల తరువాత ఆదివారం కనిష్టానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 8039 కరోనా కేసులు నమోదుకాగా 236 మంది మృతి చెందారు. కరోనా నుంచి 9905 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,03,859 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్య 3,45,80,832 చేరుకోగా 4,68,790 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 3,40,08,183 మంది కోలుకున్నారు. నమోదైన కేసులో ఒక్క కేరళలో 4350 కేసులు నమోదుకావడంతో పాటు 159 మంది చనిపోయారు. ఇప్పటి వరకు దేశంలో 122.41 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- Advertisement -