Wednesday, January 22, 2025

సౌదీలో ఒకే రోజు 81 మందికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

81 executed in a single day in Saudi

ఉగ్రవాదుల ముద్రలతో మట్టుపెట్టారు

దుబాయ్ : సౌదీ అరేబియాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేరోజు 81 మందికి మరణశిక్ష అమలు పర్చారు. ప్రాణాలు తీశారు. ఉగ్రవాద ఘటనల నేరాలతో దోషులుగా నిర్థారణ అయిన వారిని ఒకే రోజు సామూహికంగా మట్టుపెట్టారు. గత ఏడాది ఒక్కరోజు అమలుపర్చిన మరణశిక్ష సంఖ్యలను అధిగమించి ఇప్పుడు ఈ చర్యకు పాల్పడ్డారు. శనివారం మరణశిక్షకు గురైన వారిలో 73 మంది సౌదీలు, ఏడుగురు యెమెన్ జాతీయులు ఒక్క సిరియన్ ఉన్నారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్, అల్‌ఖైదా, యెమెన్‌కు చెందిన హుతి రెబెల్ శక్తులు లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు చెందిన వీరి నేరాలు నిర్థారణ అయినందున వీరికి మరణశిక్షను అమలుపర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయని అక్కడి అధికారిక సౌదీ ప్రెస్ ఎజెన్సీ (స్పా) తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News