- Advertisement -
బెర్లీన్: జర్మనీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరదలు ముంచెత్తడంతో 81 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు నగరాలు నీటిలో మునిగిపోవడంతో జర్మనీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనికి భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. పశ్చిమ జర్మనీలో కొన్ని వేల ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. జాతీయ రహదారులు, రోడ్లు అన్ని వరదల్లో కొట్టుకపోయాయి. రెస్య్కూ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య రెండు మూడు వేల వరకు ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది.
- Advertisement -