Wednesday, January 22, 2025

మరో 81 మంది తహసీల్దార్‌లకు డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో 81 మంది తహసీల్దార్‌లకు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం క్రితం 19 మందికి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం మరో 81 మందికి పదోన్నతి కల్పించడంతో మొత్తం 100 మంది తహసీల్దార్‌లకు డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతి దక్కింది.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

వీరితో పాటు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్‌లుగా పనిచేస్తున్న 5 గురికి డిప్యూటీ కలెక్టర్‌లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతోపాటు చౌటుప్పల్ ఆర్‌డిఓగా కెఎంవి జగన్నాథరావును, హైదరాబాద్‌లో లా ఆఫీసర్‌గా బి.శకుంతలను నియమిస్తూ ప్రభుత్వం మరో జిఓలో ఉత్తర్వులను జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లు గా పదోన్నతి పొందిన తహసీల్దార్‌లకు ట్రెసా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News