హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలవరం పెడుతుంది. గడిచిన 24గంటల్లో 1,08,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 8,126 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 38 మంది తాజాగా కోవిడ్-19 తో మృతి చెందారు. అదే సమయంలో 3,307 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62,929 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 3.30లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 1,999 మందిని కరోనా కబలించింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ లో 1,259, మేడ్చల్ 676, రంగారెడ్డి 591, నిజామాబాద్ 497, నల్గొండ 346, ఖమ్మం 339, వరంగల్ అర్బన్ 334, సిద్దిపేట 306, మహబూబ్ నగర్ 306, కరీంనగర్ 286, జగిత్యాల 264, మంచిర్యాల 233, సంగారెడ్డిలో 201 మందికి వైరస్ సోకింది. తెలంగాణలో రికవరీ రేటు 83.57శాతానికి తగ్గిందని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
8126 new covid-19 cases reported in telangana