Monday, December 23, 2024

హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేశారు. ఎస్‌ఐ నుంచి హోంగార్డు వరకు 82 మందిని బదిలీ చేశారు. వీరిని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు.

ప్రగతి భవన్ ముందు మాజీ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ షకీల్ కుమారుడు సాహిల్ బారీకేడ్లను కారు ఢీకొట్టాడు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు పోలీసులు సహకరించడంతో ఇద్దరిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు తారుమారు చేసిన విషయం విధితమే. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది వేటు పడినట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News