Wednesday, January 22, 2025

2022లో 82% జాబ్ మార్పును కోరుకుంటున్నారు..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : ఈ కొత్త సంవత్సరంలో(2022) దేశంలోని 82 శాతం మంది ఉద్యోగులు తమ జాబ్‌ను మారాలని భావిస్తున్నారని, అయితే భవిష్యత్ పని పట్ల వారు ఆశావాదంతో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. మంగళవారం జాబ్ పోర్టల్ లింక్డ్‌ఇన్ సర్వే నివేదికను విడుదల చేసింది. దేశంలో 1,111 ప్రొఫెషనల్స్(వృత్తి నిపుణులు) స్పందనల ఆధారంగా నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం, భారత్‌లో 86 శాతం మంది ప్రొఫెషనల్స్ వారి వృతి పరమైన నెట్‌వర్క్ సామర్థంపై విశ్వాసంతో ఉండగా, వారు కొత్త జాబ్ అవకాశాల కోసం కొత్త సంవత్సరంలో ఎదురుచూస్తున్నారు. 2022 సంవత్సరంలో వీరు తమ ఉద్యోగ విధివిధానాలు, కేరీర్, మొత్తం ఉపాధి అవకాశాల లభ్యత గురించి ఆశాభావంతో ఉన్నారు. చాలా వరకు సౌకర్యవంతమైన పని విధానానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా మహమ్మారి ఉద్యోగులు తమ కేరీర్‌పై పునరాలోచించడానికి, మార్పును కోరేందుకు ప్రేరేపించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News