Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 8329 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

New Corona Variant Detected In Israel

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8329 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తరువాత వరసగా కేరళ(2415), ఢిల్లీ(655) కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.32 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 40 వేల మందిపైగా చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 194.9 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News