Monday, November 18, 2024

అమెరికాలో తెలంగాణ విద్యార్థికి కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పుచ్చా వరుణ్ రాజ్ అనే ఒక 24 సంవత్సరాల తెలంగాణ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇండియానాకు చెందిన వల్పారైసో నగరంలోని జిమ్‌లో ఆండ్రాడ్(24) అనే వ్యక్తి వరుణ్‌ను కత్తితో పొడిచాడు. నిందితుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.వాల్పరైసో యూనివర్సిటీలో వరుణ్ రాజ్ ఎంఎస్ చదువుతున్నాడు. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన వరుణ్ రాజ్ తండ్రి రామమూర్తి మహబూబాబాద్ జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తనకుమారుడిని ఆదుకోవాలని, తన కుమారుడికి మెరుగైన వైద్య చికిత్స అందచేయడంలో సహాయపడాలని కోరుతూ ఆయన రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిశారు.

కత్తిపోట్లకు గురైన వరుణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కణతపై అతనికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం బాధితుడు ఫోర్ట్ వేనె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను బతికే అవకాశాలు కేవలం ఐదు శాతం వరకు మాత్రమే ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

తననుఅంతం చేయనున్నట్లు మెసేజ్ రావడంతో నిందితుడు ఆండ్రాడ్ పబ్లిక్ జిమ్‌లోకి వెళ్లాడని, వరుణ్‌ను చూసి అతనే తనను చంపనున్నట్లు భావించి అతడిని కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News