Sunday, December 22, 2024

ఎపిలో కొత్తగా 840 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

840 new covid cases reported in andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 840 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి చెందగా మరో 133 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 2,972 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. విశాఖ జిల్లాలో 183, చిత్తూరు జిల్లాలో 150 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,79,763కి చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News