Saturday, December 21, 2024

843 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

sensex

ముంబై: నిఫ్టీ 17,000 స్థాయికి దిగువన ముగియడంతో భారత బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ దిగువనే ముగిశాయి. మార్కెట్ సెషన్  ముగింపులో సెన్సెక్స్ 843.79 పాయింట్లు లేదా 1.46% క్షీణించి 57,147.32 వద్ద,  నిఫ్టీ 257.50 పాయింట్లు లేదా 1.49% క్షీణించి 16,983.50 వద్ద ముగిశాయి. దాదాపు 1036 షేర్లు లాభపడగా, 2291 షేర్లు క్షీణించాయి,  133 షేర్లు మారకుండా యథాతథంగా నిలిచాయి. నిఫ్టీలో  దివీస్ ల్యాబ్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా,జెఎస్‌డబ్ల్యూ స్టీల్ ,  ఐషర్ మోటార్స్ టాప్ నష్టపోయిన వాటిలో ఉండగా,  యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లాభపడిన వాటిలో ఉన్నాయి.

ఆటో, మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 1-3 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1 శాతానికి పైగా పడిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News