Friday, November 22, 2024

126 రోజుల తరువాత మళ్లీ భారీగా పెరిగిన కరోనా

- Advertisement -
- Advertisement -

శనివారం ఒక్క రోజునే కొత్తగా 843 పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ : దాదాపు 126 రోజుల విరామం తరువాత దేశంలో మళ్లీ కరోనా కేసులు కొత్తగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరాల ప్రకారం శనివారం దేశంలో కొత్తగా 843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,839 కి చేరింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్లకు ( 4,46,94,349 ) చేరింది.

కొత్తగా నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,799 కి చేరింది. తాజాగా జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు, కేరళలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 4,41,58,161మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతం ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 220.64 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్టు వివరించింది. దేశంలో సగటు రోజువారీ కొవిడ్ కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. సగటు రోజువారీ కొత్త కేసులు నెల కిందట ఫిబ్రవరి 28న 112 కేసులు ఉండగా, ఇప్పటికి 800 దాటడం గమనార్హం.

మరోవైపు అనేక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తదితర ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలతో లేఖలు రాసింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని , కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోందని సూచిస్తూ ఆరోగ్యకార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News