న్యూఢిల్లీ : దేశంలో గతకొద్ది కాలంగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. మంగళవారం 12,13,130 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 8439 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క కేరళ లోనే 4656 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో 9525 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 555 రోజుల కనిష్ఠానికి తగ్గి … 93,733 కి చేరాయి. దేశంలో ఇప్పటివరకు 3.46 కోట్ల మందికి కరోనా సోకగా, వారిలో 3.40 కోట్ల మంది కరోనాను జయించారు. క్రియాశీల రేటు 0.27 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. మంగళవారం 195 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 4.73 లక్షలకు చేరింది. మంగళవారం 73 లక్షల మందికి పైగా టీకా వేయించుకోగా, ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 129 కోట్ల మార్కును దాటింది.
8439 కొత్త కేసులు.. 9525 రికవరీలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -