Saturday, December 21, 2024

పారామిలిటరీ దళాలలో 84,600 ఉద్యోగ ఖాళీలు

- Advertisement -
- Advertisement -

84600 Posts lying Vacant in Paramilitary Forces

పారామిలిటరీ దళాలలో 84,600 ఉద్యోగ ఖాళీలు
2023 డిసెంబర్ కల్లా పోస్టుల భర్తీ
లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ: సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్‌తోసహా ఆరు పారామిలిటరీ దళాలలో 84,600 మేరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో ఈ దళాలలో 1.12 లక్షల పోస్టులను భర్తీ చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాల ప్రకారం పారామిలిటరీ దళాలలో 10 శాతం ఖాళీలను మాజీ సైనిక సిబ్బందితో భర్తీ చేయాలని, ప్రత్యక్ష నియామకం ద్వారా సహాయ కమాండెంట్ స్థాయి వరకు వీరిని భర్తీ చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

ఇవిగాక.. సూత్రప్రాయంగా లభించిన ఆమోదం ప్రకారం ఈ దళాలలో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీలో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, రక్షణ దళాలలో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని అగ్నివీరులు బయటకు వచ్చిన తర్వాత ఈ నియామకాలు జరగాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 2022 జులై 31వ తేదీ నాటికి కేంద్ర సాయుధ పోలీసు దళాలు, అస్సాం రైఫిల్స్‌లో 84,659 ఖాళీలు ఉన్నాయని ఆయన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఈ దళాలలో ప్రస్తుతమున్న ఖాళీలను 2023 డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.

84600 Posts lying Vacant in Paramilitary Forces

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News