కొవిడ్19 సోకిన వారిపై యుకెలో నిర్వహించిన సర్వేలో వెల్లడి
లండన్: ఆక్స్‌ఫర్డ్‌ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి కొవిడ్19 సోకి లక్షణాలు వ్యక్తమైనపుడు కూడా 85-90శాతంమేర రక్షణ లభిస్తున్నట్టు ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్యశాఖ(పిహెచ్‌ఇ) నిఘా నివేదిక పేర్కొన్నది. కొవిడ్19కు గురైనవారి మరణాలు, ఆస్పత్రులపాలైనవారి డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్టు తెలిపింది. రియల్ వరల్డ్ మెథడ్ పేరుతో ఆస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు తీసుకున్నవారిపై నిర్వహించిన మొదటి సర్వే నివేదిక ఇది. ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఈ సర్వేలో రెండు డోసులు తీసుకున్న 60 ఏళ్లు పైబడినవారిలో 13,000మందిని, 80 ఏళ్లు పైబడిన వారిలో 11,100మందిని, 70 79 వయసు వారిలో 1600మందిని, 6069 వయసు వారిలో 300మందిని మరణించకుండా కాపాడినట్టు పిహెచ్‌ఇ పేర్కొన్నది.
65 ఏళ్లు పైబడినవారిలో 39,100మందిని, 65 74 వయసు వారిలో 4700మందిని, 7584 వయసు వారిలో 15,400మందిని, 85 ఏళ్లు పైబడిన వారిలో 19,000మందిని ఆస్పత్రిపాలు కాకుండా కాపాడినట్టు పిహెచ్‌ఇ తెలిపింది. ఈ డేటా ఆధారంగా రెండు డోసులు తీసుకున్నవారికి 90 శాతం వరకూ రక్షణ లభిస్తున్నట్టు అర్థమవుతోందని యుకె వ్యాక్సినేషన్ మంత్రి నదీమ్ జవాయీ అన్నారు. తమ దేశంలో ఇప్పటికే వృద్ధుల్లోని ప్రతి ముగ్గురిలో ఒకరికి రెండు డోసులు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పుడు 34 ఏళ్లుపైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. యుకెలో ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌తోపాటు ఫైజర్/బయో ఎన్‌టెక్, మోడెర్నా టీకాలను కూడా పంపిణీ చేస్తున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్లను మన దేశంలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే.