Friday, December 20, 2024

85 ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

ముంబై/న్యూఢిల్లీ: విమాన సిబ్బంది(క్యాబిన్ క్రూ) కొరత వరుసగా మూడవరోజు కొనసాగడంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం 85 విమాన సర్వీసులను రద్దు చేసింది. అంతేగాక సమ్మెలో ఉన్న విమాన సిబ్బందిలో దాదాపు 25 మందికి టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గురువారం తొలగింపు ఉత్తర్వులను జారీచేసింది. నిర్వహణా వైఫల్యాలకు నిరసనగా విమాన సిబ్బందిలో కొందరు అనారోగ్యం కారణంతో మంగళవారం నుంచి విధులకు గైర్హాజరు కావడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలతోసహా దాదాపు 170 విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది.

విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దు కావడం వంటి అంతరాయాలను అధిగమించేందుకు మే 13 వరకు విమాన సర్వీసులను పరిమితంగా నడపాలని కూడా ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఎయిర్‌లైన్స్‌కు చెందిన 20 రూట్లలోనే ఎయిర్ ఇండియా సర్వీసులు నడుస్తాయి. కొందరు ఉద్యోగుల చర్యలు వేలాదిమంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నందున సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఉద్యోగులలో కొందరిని తొలగిస్తూ లేఖలు జారీచేసిన విషయాన్ని ఎయిర్ ఇండియా ప్రస్తావించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News