Friday, January 10, 2025

భారత్ నుంచి రూ.85వేల కోట్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో తయారై ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మొబైల్ ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా సెల్యూలర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)శనివారం వెల్లడించిన డేటా ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ.85వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతయ్యాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) స్కీమ్‌ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఎగుమతులతో పోలిస్తే భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొబైల్ రికార్డుస్థాయిలో ఎగుమతి అయ్యాయి. కాగా భారత్ నుంచి మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఎగుమతి అవుత్ను దేశాల్లో యూఎఇ, యూఎస్, నెదర్లాండ్స్, యూకె, ఇటలీ తొలి ఐదుస్థానాల్లో ఉన్నట్లు ఐసిఇఎ డేటా వెల్లడించింది.

చైనా నుంచి స్మార్ట్‌ఫోన్ తయారీ పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోవడంతో భారత్, వియత్నాం భారీ లబ్ధిదారులుగా కాగా భారత్ విక్రయిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో 97శాతంకు పైగా స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయి. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారుదారుగా ఉంది. ఎఫ్‌వై 23లో భారత్ మొబైల్ ఫోన్ల ఎగుమతిలో రూ.85,000కోట్ల మార్కును అధిగమించిందని ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఏడాది భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి కోట్ల రూపాయలుకు చేరుకోవాలనేది లక్షంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News