Wednesday, January 22, 2025

‘రూ. 850 కోట్ల కుంభకోణం’.. చీఫ్ సెక్రటరీ, డివిజినల్ కమిషనర్ తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రూ.850 కోట్ల విలువైన ఓ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, డివిజినల్ కమిషనర్ అశ్వినీ కుమార్‌లను తక్షణమే పదవులనుంచి తొలగించాలని ఢిల్లీ విజిలెన్స్ మంత్రి ఆతిషి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం సిఫార్సు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తన కుమారుడు కరణ్ చౌహాన్‌కు సంబంధం ఉన్న ఓ కంపెనీకి అక్రమ లాభం కలిగించడం కోసం ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే కోసం బమ్నో గ్రామంలో సేకరించిన భూమికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పెంచేశారని ఆతిషితన నివేదికలో ఆరోపించారు.

ద్వారా ఎక్స్‌ప్రెస్ వే భూ సేకరణలో ఢిల్లీ సౌత్‌వెస్ట్ జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్, భూ యజమానులతో చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ కుమ్మక్కయినట్లు చోటు చేసుకున్న సంఘటనలను బట్టి చూస్తే అర్థమవుతోందని దాదాపు 670 పేజీలున్న ప్రాథమిక నివేదిక పేర్కొంది. వాస్తవంగా లబ్ధిదారులకు రూ.850 కోట్ల మేరకు నష్టపరిహారం చెల్లింపు ద్వారా లబ్ధి చేకూరినా కుంభకోణం విలువను రూ.312 కోట్లుగా తక్కువ చేసి చూపించడానికి చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ సహా ఢిల్లీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్ అధికారులు కుట్రకు పాల్పడినట్లు కూడా నివేదికలో పేర్కొన్నట్ల్లు అధికార వర్గాలు తెలిపాయి.

లబ్ధిపొందుతున్న భూ యజమానులతో నరేశ్ కుమార్ కుమారుడికి వ్యాపార సంబంధాలున్నట్లు కనిపిస్తోందని కూడా ఆతిషి తన నివేదికలో పేర్కొన్నారు. నరేశ్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అయినప్పటినుంచి జరిగిన సంఘటనలను గమనించినట్లయితే తన కుమారుడి వ్యాపారంతో సంబంధాలున్న లబ్ధిదారులకు నష్టపరిహారాన్ని పెంచేందుకు ఆయన తన అధికారాలను ఉపయోగించినట్లు అర్థమవుతోందని కూడా ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న సిబిఐ నివేదికకు తోడుగా పూర్తి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కు పంపించాలని కూడా ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News