- Advertisement -
పరీక్షలకు 86.42 శాతం విద్యార్థులు హాజరు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరో తరగతి ప్రవేశ పరీక్షను నిర్వహించగా, ఏడో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 86.42 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 18607 మంది బాలురు, 16090 బాలికలు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షలకు 73201 మంది దరఖాస్తు చేసుకోగా.. 63263 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
- Advertisement -