Sunday, April 6, 2025

ఐజి ఎదుట పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ చేయూతకు మంచి స్పందన వస్తోంది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. పోలీసు బెటాలియన్ కార్యాలయంలో మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్లు బిజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలుస్తోంది. ఆపరేషన్ చేయూత కింద లొంగిపోయిన మావోయిస్టులకు ఐజి రూ.25 వేల చెక్కులను అందించారు. లొంగిపోయిన వారిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.

ఈ సందర్భంగా ఐజి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అదివాసీల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని.. కొందరు మావోయిస్టు పార్టీల పేరు చెప్పి.. డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఆపేయాలని తెలిపారు. ఆపరేషన్ చేయుతకి మంచి స్పందన వస్తుందని, గత నాలుగు నెలల్లో మొత్తం 203 మంది లొంగిపోగా.. 66 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News