Monday, January 20, 2025

86 శాతం ఓపెన్ వ్యాగన్లు బొగ్గు రవాణాకే

- Advertisement -
- Advertisement -

86% of open wagons are for coal transportation

విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైల్వేల కార్యాచరణ

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం రైల్వే తన వద్ద ఉన్న ఓపెన్ వ్యాగన్లలో 86 శాతం వ్యాగన్లను రంగంలోకి దించింది. రైల్వే వద్ద 1,31,403 ఓపెన్ వ్యాగన్లు ఉండగా, అందులో 1,13,880 వ్యాగన్లను బొగ్గు రవాణా కోసం రైల్వే ఉపయోగిస్తోంది. బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో సంప్రదించి రూపొందించిన ప్రణాళికలో భాగంగా రైల్వేలు ఈ చర్య తీసుకుంది. తాజా రైల్వే గణాంకాల ప్రకారం సంస్థ వద్ద దాదాపు 3,82,562 వ్యాగన్లు ఉండగా అందులో 1,31,403 ఓపెన్ వ్యాగన్లు ఉన్నాయి. మరో 3, 636 వ్యాగన్లు మరమ్మతుల్లో ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్ల అవసరాలు తీర్చడం కోసం రైల్వేలు ప్రతి రోజూ సగటున దాదాపు 28,470 వ్యాగన్ల బొగ్గు నింపుతోంది. సాధారణంగా ఒక బొగ్గు రైలుకు 84 దాకా వ్యాగన్లు ఉంటాయి. బొగ్గు రవాణాను వేగవంతం చేయడం కోసం జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లాంటి బొగ్గు గనులున్న రాష్ట్రాల్లో 122 చోట్లు మూడు, నాలుగు రైళ్లను కలిపి నడిపే వినూత్న పద్ధతిని కూడా రైల్వే ఉపయోగిస్తోంది.

రైల్వే, బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ సమావేశాల్లో బొగ్గు రవాణాకు సంబంధించి 18 ముఖ్యమైన అంశాలను గుర్తించారు. బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ చేసే సమయంలో ఎక్కువ సమయం ఒక్కో సారి 10 రోజుల పాటు రేక్స్ ఒకే చోట నిలిచి పోతుండడం వాటిలో ప్రధానమైనది. అలాంటి పరిస్థితుల్లో బొగ్గు రవాణాను వేగవంతం చేయడం కోసం 40 50 దెబ్బతిన్న వ్యాగన్లను కూడా రంగంలోకి దించాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. సాధారణంగా 7,500 కిలోమీటర్లు నడిచిన తర్వాత వ్యాగన్లను దెబ్బతిన్నవిగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ గడువును 10,000 కిలోమీటర్లకు పెంచినట్లు వారు చెప్పారు. అంతేకాదు సాధారణంగా71 మిలియన్ టన్నుల బొగ్గును తీసుకుని వెళ్లే రైలు ఇప్పుడు ఒక టన్ను అదనపు లోడ్ తీసుకెళ్తున్నట్లుగా కూడా వారు చెప్పారు.

బొగ్గు రవాణాపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల స్టీల్, అల్యూమినియం రవాణాపై దాని ప్రభావం పడుతోందని రైల్వే అధికారులు చెప్తున్నారు.2021 22 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు 653 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేశాయి. అంతకు ముందు ఏడాదికన్నా ఇది 20.4 శాతం ఎక్కువ. ఇందులో దాదాపు 83 శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయగా, మిగతాది ఇతర తయారీ యూనిట్ల ఫౌండ్రీలకు రవాణా చేశారు బొగ్గు రవాణాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దాని ప్రభావం ఇతర సరకుల రవాణాపైన, ప్రయాణికుల రైళ్లపైన కూడా పడుతోందని అధికారులు అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News