Sunday, January 19, 2025

2000 నోట్లు 88% వెనక్కి వచ్చాయ్..

- Advertisement -
- Advertisement -

ముంబై : బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాదాపు రూ.3.14 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు, అంటే 88 శాతం వెనక్కి వచ్చాయని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. వెనక్కి వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగతా 13 శాతం ఇతర మార్గాల ద్వారా వచ్చాయి. రిజర్వు బ్యాంక్ మే నెలలో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం, 2023 జులై 31 నాటికి మొత్తం రూ.3.14 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయి. జూలై 31న ఆఖరి రోజు రూ.42 వేల కోట్ల నోట్లు తిరిగి వచ్చాయని ఆర్‌బిఐ తెలిపింది. అయితే 2023 మార్చి 19 నాటి సర్కులేషన్‌లో ఉన్న రూ.2 వేల నోట్లలో దాదాపు 88 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లు రూ.2 వేల నోట్ల చలామణిలో ఉండగా, ఇక 2023 మార్చి 19 నాటికి రూ.3.56 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News