Sunday, December 22, 2024

గురుకుల ప్రవేశ పరీక్షకు 89.39 శాతం హాజరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 89.39 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 6, 7, 8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం మొత్తం 77,449 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 69,230 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

6వ తరగతి ప్రవేశ పరీక్షకు 36,335 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 32,590 మంది విద్యార్థులు, ఏడో తరగతి ప్రవేశ పరీక్షకు 21,764 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 19,327మంది విద్యార్థులు , ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు 19,350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 17,313 మంది విద్యార్థులు హాజరయ్యారని మల్లయ్య బట్టు నేడొక ప్రకటనలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News