Thursday, January 23, 2025

89 శాతం పెద్దలకు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

- Advertisement -
- Advertisement -

89% Covid Vaccination Completed to old age people

న్యూఢిల్లీ: దేశంలోని 18 సంవత్సరాలు పైబడిన జనాభాలో 89 శాతం మంది పూర్తిగా కొవిడ్ వ్యాక్సినేషన్ పొందారని, 12-14 వయస్కులలో 75 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 195.67 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2,51,69,966 సెషన్ల ద్వార పూర్తి చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. సబ్‌కా సాథ్ సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో భారత్ ఈ ఘనతను సాధించిందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన పిల్లలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని కరోనాపై దేశం సాగిస్తున్న యుద్ధంలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలోని 18-59 వయస్కులైన వారికి 36,61,899 కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. 15-18 వయస్కులైన 5.99 మంది కోట్ల మందికి కూడా మొదటి డోసు వ్యాక్సిన్ అందచేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

89% Covid Vaccination Completed to old age people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News