- Advertisement -
ఢిల్లీ: కరోనాతో దేశ ప్రజల యుద్ధం చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. రేడియో ద్వారా ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. జూన్ 21న వ్యాక్సినేషన్‌లో రికార్డుస్థాయిలో వ్యాక్సిన్లు వేశారని, ఒకే రోజు 89 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగిందని, వ్యాక్సిన్లు తీసుకోవడంలో భయాందోళనలు వీడాలని ప్రజలకు సూచించారు. కరోనా వ్యాక్సిన్ తిరస్కరించడం ప్రమాదకరమని, కోవిడ్ ముప్పు తగ్గిందని అజాగ్రత్తగా ఉండొద్దని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో తన కుటుంబానికే కాదు గ్రామానికి అపాయం కలిగించిన వారు అవుతారని పేర్కొన్నారు. మిల్కా సింగ్ మృతి పట్ల మోడీ సంతాపం తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు హృదయాలను గెలిచి దేశానికి మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు.
- Advertisement -