Thursday, January 23, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 89శాతం స్థల సేకరణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం కావలసిన మొత్తం 1396 హెక్టార్ల స్థలంలో 89 శాతం అంటే 1248 హెక్టార్ల స్థలాన్ని సేకరించడమైందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కారణం స్థల సేకరణలో, కాంట్రాక్టులు ఖరారులో జాప్యం, కొవిడ్ తీవ్ర పరిణామాలు కారణమని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు స్థల సేకరణలో మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా ఐదు గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగమైన గుజరాత్‌లో కావలసిన మొత్తం 954.28 హెక్టార్లలో 98.76 శాతం సేకరించడమైందని చెప్పారు.

89% of Land Acquisition for Bullet Train Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News