Thursday, January 23, 2025

నేడు తిరపతి నగరం 894వ పుట్టిన రోజు వేడుకలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న ఏకైక నగరం తిరుపతి అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శనివారంలో తిరుపతి నగరం పుట్టిన రోజు వేడుకలను టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి నగరం 894వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. గోవిందా రాజపురంగా భగవత్ రామానుజ చార్యులు నామకరణం చేసినట్టు శిలా శాసనాలు చెబుతున్నాయని భూమన పేర్కొన్నారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకుకు పట్టణ వాసులు తరలిరావాలని కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావించిందని తెలియజేశారు. ఈ పుట్టిన రోజు వేడుకలలో టిటిడి ఇఒ ధర్మారెడ్డి, అధికారులు, పెద్ద ఎత్తున కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు. వేడుకల నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News