Thursday, January 23, 2025

బీమా సెక్టార్‌లో 9000 కొత్త ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి మరో దిగ్గజ సంస్థ ఫిదా అయింది. దిగ్గజ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును అగ్రశ్రేణి గ్లోబల్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సంస్థ ఆలియంట్ ప్రతినిధులు కలిశారు. హ్యూస్టన్‌లో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కెటిఆర్‌తో ఆలియంట్ గ్రూప్ సిఈఓ ధవల్ జాదవ్ సమావేశమయ్యారు. అనంతరం తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా సెక్టార్‌లో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని ధవల్ జాదవ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో తమ కంపెనీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరో 8 మంది మావోయిస్టుల అరెస్ట్

ఆలియంట్ ప్రకటపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. టాక్స్,అకౌంటింగ్, ఆడిట్, సర్వీసెస్, ఐటీ టెక్నాలజీ రంగాల్లోని యువతకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బ్యాకింగ్, ఫైనాన్స్, బీమా రంగాలకు హైదరాబాద్ కీలకమన్న సంగతి ఆలియంట్ ప్రకటనతో మరోసారి రుజువైందని తెలిపారు. వెయ్యి మంది ఉద్యోగులతో 2020 నుంచి ఆలియంట్ గ్రూప్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఆడిట్, టాక్స్, అకౌంటింగ్‌లో సేవలను అందిస్తోంది. తన కన్సల్టింగ్ విభాగం ద్వారా కొత్తగా 9 వేల ఉద్యోగాలను కల్పించబోతుంది. దీంతో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య పది వేలకు చేరుతుంది. ఈ సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణు వర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News