Wednesday, January 1, 2025

తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవిపై 9 కేసులు..

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మపై కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఏపీ సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్మపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వర్మను విచారించేందుకు రెండు సార్లు పోలీసులు నోటీసులు పంపించినా స్పందించలేదు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వర్మ.. ఎపి హైకోర్టను ఆశ్రయించాడు.

అయితే, ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ కోర్లు ఆయనకు షాకిచ్చింది. మరోవైపు, విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులోకి రాలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియక తిరిగి వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రాంగోపాల్‌వర్మ కోసం తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసు బృందాలు గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసుపై వీడియో కాల్ ద్వారా స్పందించిన ఆర్జీవీ.. తాను ఎక్కడికి పారిపోలేదని, సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News