Thursday, December 19, 2024

కవితకు 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీ నుంచి సిబిఐ ఆధీనంలోకి తీసుకుని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో మూడు రోజులు ఆమెను అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు సోమ వారం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సిబిఐ కోరగా, 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదే శాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితను అధికారులు మరోసారి తీహార్ జైలుకు తరలించారు.

అయితే కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బిజెపి కస్టడీ అని అన్నారు. బయట బిజెపి పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని వెల్లడించారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఎంఎల్‌సి కవితను అధికారులు సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు.

అంతకు ముందు కోర్టులో కవితను కస్టడీకి కోరుతూ సిబిఐ, ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారి అని వెల్లడించింది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు కస్టడీ కోరగా ఈనెల 14వ తేదీ వరకు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మూడ్రోజుల సిబిఐ కస్టడీలో అధికారులు కవితను మద్యం కుంభకోణంలో దాగి ఉన్న విషయాలు రాబట్టేలా వివిధ కోణాల్లో ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News