Wednesday, January 22, 2025

రెండు బస్సులు ఢీ: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వడక్కంచేరి వద్ద విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సును కేరళ ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో తొమ్మిది మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 36 మంది గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు ప్రయణికులు ఉన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News