Monday, December 23, 2024

నాంపల్లి ఘటనలో 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఓ అపార్టుమెంటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరి కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్‌లలో అద్దెకు ఉండే కుటుంబాలు మంటల్లో చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. అపార్టుమెంటులో చిక్కుకున్న 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.అపార్టుమెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గ్యారేజీలో కారును రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయని, అపార్టుమెంటు ముందు పార్క్‌ చేసి ఉన్న ఒక కారు, ఆరు ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News