- Advertisement -
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా నగరం స్టాండ్ రోడ్డు ఓ భవనంలోని 13వ ఫ్లోర్ లో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. మృతులలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు ఆర్ పిఎఫ్ జవాన్లు, ఒక ఎఎస్ఐ, మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని కోల్ కతా కమిషనర్ సౌమెన్ మిత్రా తెలిపారు. మృతులపట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు పది లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు.
- Advertisement -