Monday, December 23, 2024

అమెరికాలో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని జాస్పర్ కౌంటీలో ఓ ప్రైవేట్ బిల్డంగ్ లో నిర్వహించిన పార్టీ వేడుకలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో తొమ్మిది మంది యువకులకు గాయాలయ్యాయి.

కాల్పుల సమయంలో పార్టీలో సుమారు 250 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జాస్పర్ పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News