Sunday, December 22, 2024

బస్సు లోయలో పడి 9మంది జవాన్ల మృతి

- Advertisement -
- Advertisement -

లోయలో పడిన సైనికుల వాహనం
9 మంది జవాన్లు మృతి 

లేహ్ సమీపంలో దుర్ఘటన
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి

లడఖ్: లడఖ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి జారి లోయలో పడి పోవడంతో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది సైనికులున్నట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. మరో సైనికుడికి గాయాలయ్యాయి. లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ వద్ద శనివారం సాయంత్రం6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులు కారూ గారిసన్‌ నుంచి లేహ్ సమీపంలోకి ఖేరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాన్వాయ్‌లో ఐదు వాహనాలు, 34 మంది జవాన్లు ఉన్నట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘లడఖ్‌లోని లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో జవాన్లు మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది. దేశానికి వారి ఎనలేని సేవలను ఎప్పటికీ మరువలేము.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాజ్‌నాథ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News