Monday, January 20, 2025

సోలార్ కంపెనీలో పెలుడు.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

సోలార్ కంపెనీలో పెలుడు సంభవించి 9మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్ పూర్ జిల్లాలోని బజార్ గాన్ గ్రామంలో ఉన్న సోలార్ కంపెనీలోని క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ లో ఆదివారం ఉదయం ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పెలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బందితో కలిసి హుటాహిటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందినట్లు నాగ్ పూర్ రూరల్ పోలీసులు తెలిపారు. మరికొంతమంది ప్లాంట్ లోనే చిక్కుకుపోయారని.. వారిలో నలుగురిని బయటకి తీసుకొచ్చి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News