Friday, November 22, 2024

బీహార్‌లో చెరువులో కారు బోల్తా… 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 killed as car overturns in pond in Bihar

పుర్నియా ( బీహార్ ) : బీహార్ పుర్నియా జిల్లాలో శనివారం తెల్లవారు జాము 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యువి వాహనం వేగంగా దూసుకు వస్తూ అదుపు తప్పడంతో రోడ్డు పక్కనున్న చెరువు నీటిలో పడిపోయింది. ఈ వాహపంలో మొత్తం 11 మంది ఉన్నారు. పుర్నియా జిల్లా లోని తారాబడి ఏరియాలో పెళ్లికి ముందు నిర్వహించే తిలక్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి కిషన్‌గంజి జిల్లా నానియా గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బైసీ సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ కుమారి టౌసీ చెప్పారు. డ్రైవర్ అదుపు తప్పడంతో పుర్నియా కిషన్ గంజ్ స్టేట్ హైవే పక్కనున్న చెరువు నీటిలో వాహనం బోల్తాపడింది. ఎస్‌యువిలో ఉన్న మొత్తం 11 మందిలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు గంగాప్రసాద్ యాదవ్, కరణ్‌లాల్ యాదవ్, సండవ్ లాల్ యాదవ్, అమర్‌చంద్ యాదవ్, మానిక్ లాల్ శర్మ, రామక్రిషన్ యాదవ్, గులాబ్‌చంద్ లాల్ యాదవ్, కాలీచరణ్ యాదవ్, తన్వీర్ ఆలమ్‌లుగా గుర్తించారు. వీరిలో ఏడుగురు బంధువులు.

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంతాపం
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదవార్తకు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం వెలిబుచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదం తనను ఎంతో బాధకలిగించిందని, మృతుల కుటుంబాలకు ఆత్మ నిబ్బరం కలిగేలా భగవంతుడ్ని ప్రార్థిస్తునానని ముఖ్యమంత్రి సంతాప సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News