Friday, December 20, 2024

భారీ వర్షాలతో గుజరాత్ గజగజ

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలతో గుజరాత్ గజగజ
అహ్మదాబాద్‌లో ట్రాఫిక్ జాం..
పల్లపు ప్రాంతాలు జలమయం
రెండురోజులలో తొమ్మిది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్‌లో పలు ప్రాంతాలు శనివారం తెల్లవారుజాము నుంచి భారీవర్షాలతో తల్లడిల్లాయి. గడిచిన 24 గంటలలో జునాగఢ్ జిల్లాలో 398 మిల్లీమీటర్ల వర్షం పడింది. రెండు రోజులుగా వర్ష సంబంధిత ప్రమాదాలలో కనీసం తొమ్మండుగురు మృతి చెందారు. శనివారం పలు ప్రాంతాల్లో వానలు వరదలతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో పలు ప్రాంతాలు వాననీటిలో మునిగిపోవడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించాయి.

అనేక ప్రాంతాలలో వరదలు తలెత్తాయి. కచ్, జామ్‌నగర్, జునాగఢ్, నవ్సారీలలో సహాయక చర్యలకు జాతీయ విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దింపారని, చిక్కుపడ్డ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 37 తాలూకాలలో 100 మిమిల కంటే ఎక్కువ స్థాయి వర్షపాతం రికార్డు అయింది. జునాగఢ్ జిల్లాలోని విసావాదార్ తాలూకాలో అత్యధికంగా 398 మిమిల వర్షం పడింది. సౌరాష్ట్ర కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ స్థాయి వర్షాలు పడ్డాయి. దీనితో లోతట్టు ప్రాంతాలు, పలు గ్రామాలు జలమయం అయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News