Wednesday, January 22, 2025

ఘోర ప్రమాదం

- Advertisement -
- Advertisement -

9 killed in Anantapur road accident

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పెళ్లి బృందం ఇన్నోవాను ఢీకొన్న లారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఆదివారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద వేగంగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఇన్నోవాను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి చెందారు. ఈక్రమంలో కర్ణాటకాలోని బళ్లారిలో వివాహాకి వెళ్లి కారులో అనంతపురానికి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు మృతదేహాలు సైతం ఛిద్రమయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంలో మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబసభ్యులు పెను విషాదంలో మునిగిపోయారు. శుభకార్యానికి వెళ్లి వస్తూ తరలిరాని లోకాలకు మరలిపోయారంటూ మృతుల బంధువులు తీవ్రంగా రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు కోకా వెంకటప్ప కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు 

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ బోట్ క్లబ్ చెరువు వద్ద విషాదం నెలకొంది. చెరువులో మునిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సరదాగా చేపలు పడుతున్న చిన్నారులు తృటిలో చెరువులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.నీటిలో గాలించి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని నాగయక్ష సూర్యకుమార్ ్(12), వాసంతి నోవా (10)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News