చెన్నై: తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో శనివారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ సమీపంలోని నాలుగు భవనాలు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. విజయ్ అనే వ్యక్తికి చెందిన ఈ బాణసంచా ఫ్యాక్టరీ విరుధునగర్‌లోని వంబకొట్టై ప్రాంతంలో ఉంది. పేలుడు సంఘనట గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏడుగురు అక్కడకక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరనించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలోని రసాయనం కలిపే స్థలంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. గత ఏడాది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఒక బాణసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో ముగ్గురు మహిళలతో సహా 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.