Thursday, January 23, 2025

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 killed in Fatal road accident in Karnataka

హసన్ : కర్ణాటకలో ఆదివారం తెల్లవారు జామున హసన్ జిల్లాలో టెంపో వాహనం, పాల వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ధర్మస్థల ఆలయాల దర్శనానికి వెళ్లిన 14 మంది యాత్రికులు టెంపో ట్రావెలర్ వాహనంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అర్సికేర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరి వాహనం అదుపు తప్పి బస్సు, పాల వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనా స్థలి లోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీస్‌లు సహాయక చర్యలు చేపట్టారు.
క్షత గాత్రులను హసన జిల్లా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News