Monday, December 23, 2024

లోయలో పడిన కారు: తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 killed in road accident in Jammu and Kashmir

పూంఛ్ : జమ్ముకాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా బఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని బఫ్లియాజ్ ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. వివాహ వేడుక నుండి ప్రజలను తీసుకెళ్తున్న వాహనం సురన్‌కోట్‌లోని మర్హా గ్రామం నుండి బుఫ్లియాజ్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నుండి జారిపడి తరన్ వలీ వద్ద లోయలోకి పడిపోయింది. సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్‌లను పంపినట్లు పూంచ్ జిల్లా డీఎం తెలిపారు. క్షతగాత్రుల, మరణించిన బంధువులకు సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందజేస్తున్నట్లు డిఎం చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఒక పోలీసు అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News