Thursday, January 16, 2025

మహారాష్ట్రలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్రపతి శంభాజీనగర్ : మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్‌తోసహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అత్యంత వేగంతో వస్తున్న బస్సు ఆష్టాపతా వద్ద తిరగబడి ఐదుగురు మృతి చెందారు. ఈ బస్సు ముంబై నుంచి బీడ్ వైపు వేగంగా వస్తుండగా డ్రైవర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. మృతుల్లో నలుగురు బీడ్ జిల్లాకు చెందిన వారు. మరొకరు యావత్మాల్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో 26 మంది గాయపడగా ఆస్పత్రులకు తరలించారు.

మృతులు దొనడిబా షిండే, డియోడాట్ పెచె, మొహమ్మద్ ఆసిఫ్ దోస్త్, అశోక్ భోండ్వే, రవిగొడంబేగా గుర్తించారు. మరో రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ స్పీడుగా దూసుకొచ్చి ట్రక్కుకు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. ధమన్‌గావ్ అహ్మద్‌నగర్ రోడ్డులో అంభోరా వద్ద బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ అహ్మద్‌నగర్ వైపు వెళ్తోంది. అంబులెన్స్‌లో ఉన్న డాక్టర్ తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News